Monday 3 February 2014

జనవరి 2014 మాసంలో తెవికీలో తెలంగాణ ప్రాజెక్టు ప్రగతి విశ్లేషణ

జనవరి 2014 మాసంలో తెవికీలో తెలంగాణ ప్రాజెక్టు ప్రగతి విశ్లేషణ

  • జనవరి 11, 2014న ప్రారంభమైన తెలంగాణ ప్రాజెక్టు మాసాంతానికి అంటే 20 రోజులలో 26 వ్యాసాలు కొత్తగా సృష్టించబడ్డాయి. ఇందులో 22 వ్యాసాలు వ్యక్తులకు సంబంధించినవి, 2 కోటలకు, 2 రైల్వేస్టేషన్లకు సంబంధించినవి.
  • జిల్లాల వారీగా చూస్తే నల్గొండ జిల్లాకు చెందిన 7 వ్యాసాలు, మహబూబ్‌నగర్ జిల్లా, హైదరాబాదు జిల్లా మరియు ఆదిలాబాదు జిల్లాకు చెందిన వ్యాసాలు 4 చొప్పున, కరీంనగర్ మరియు వరంగల్ జిల్లాకు చెందిన వ్యాసాలు 3 చొప్పున, నిజామాబాదు జిల్లాకు చెందిన ఒక వ్యాసం కొత్తగా ప్రాజెక్టు పరిధిలో చేరాయి. రంగారెడ్డి, మెదక్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఒక్క వ్యాసంకూడా కొత్తగా చేరలేదు.
  • సభ్యులవారీగా పరిశీలిస్తే అత్యధికంగా ప్రణయ్‌రాజ్ 9 వ్యాసాలను సృష్టించగా, నేను (సి.చంద్రకాంతరావు) 7 వ్యాసాలను, నాయుడిగారి జయన్న 3 వ్యాసాలు, వైజాసత్య 2 వ్యాసాలు, భాస్కరనాయుడు 2 వ్యాసాలు, వెంకటరమణ, రహంతుల్లా, ఈగల్ ఒక్కో వ్యాసాన్ని సృష్టించారు.
  • 26 వ్యాసాలలో 19 వ్యాసాలు ప్రాజెక్టు సభ్యులు సృష్టించగా, మరో 7 వ్యాసాలు ప్రాజెక్టులో సభ్యులు కాని వారిచే సృష్టించబడ్డాయి

No comments:

Post a Comment