Thursday 23 January 2014

డిసెంబరు 2013 మాసపు తెవికీ గణాంకాలు

డిసెంబరు 2013 మాసపు తెవికీ గణాంకాలు పరిశీలిస్తే తెవికీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో దిద్దుబాట్లు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 100కు పైగా దిద్దుబాట్లు చేసిన సభ్యుల సంఖ్య ఈ మాసంలో 20గా నమోదైంది. గత రికార్డు అయిన ఫిబ్రబరి 2008 మాసపు 16 సంఖ్య కంటె ఇది 25% అధికం. కొత్త సభ్యుల సంఖ్య (5+ దిద్దుబాట్లు చేసిన వారు) ఈ మాసంలో 28 గురు కొత్తగా చేరారు. ఫిబ్రవరి 2008 నాటి 45తర్వాత ఇది రెండో అత్యధికం. 5+ దిద్దుబాట్లు చేసిన సభ్యుల సంఖ్యలో కూడా ఫిబ్రవరి 2008 మాసపు 102 తర్వాత ఇది రెండో అత్యధికం.

అలాగే మొత్తం దిద్దుబాట్ల సంఖ్యలో చూస్తే సుమారు 18వేల దిద్దుబాట్లు ఈ మాసంలో జరిగినట్లు తెలుస్తుంది. గత కొన్ని మాసాలలో పోల్చి చూస్తే ఈ సంఖ్య గణనీయంగ పెరినట్లు చెప్పవచ్చు. జనవరి 2008 మాసపు 32వేల దిద్దుబాట్ల తర్వాత సెప్టెంబరు 2006 మాసముతో కలిపి ఈ మాసం సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచినట్లయింది. వ్యాసాల సంఖ్యలో కూడా రోజుకు సరాసరిన 24 కొత్త వ్యాసాలు చేర్చబడి మొత్తం వ్యాసాలు 55 వేల మార్కుకు చేరింది. సెప్టెంబరు 2007 తర్వాత రోజు సరాసరిన పాతిక వ్యాసాలు తెవికీ రావడం ఇదే ప్రథమం.

వ్యాసాపు పేజీలలో 250+ దిద్దుబాట్ల గణాంకాలు

వ్యాసాపు పేజీలలో 250+ దిద్దుబాట్లు చేసిన సభ్యులు
సభ్యుడు    దిద్దుబాట్లు
  • YVSReddy
  • Srirama murthy
  • Rajasekhar1961
  • Pavan santhosh.s
  • Sulthan Khader
  • Bhaskaranaidu
  • Kvr.lohith
  • C.Chandra Kanth Rao
  • Veera.sj
  • Ahmed Nissar
  • T.sujatha
  • 4,984
  • 1,765
  • 1,367
  • 1,213
  • 860
  • 651
  • 557
  • 464
  • 455
  • 311
  • 283


సభ్యుల వారీగా దిద్దుబాట్లు పరిశీలిస్తే 2500 దిద్దుబాట్లలో ఈ మాసం కూడా వరసగా ఒక సంఖ్య నమోదైంది. 11 సభ్యులు 250+ దిద్దుబాట్లు చేయడం, 27 సభ్యులు 25+ దిద్దుబాట్లు చేయడం కూడా తెవికీ చరిత్రలోనే రికార్డుగా చెప్పవచ్చు. సభ్యుడు YVSREDDY చేసిన 4,984 దిద్దుబాట్ల సంఖ్య మరో తెవికీ రికార్డునే సృష్టించింది. గతంలో తాను చేసిన రికార్డునే మరోసారి అధికమించడం జరిగింది. అంతేకాకుండా ఒకే సారి 3 స్థానాలు ఎగబాకి తెవికీలో అత్యధిక వ్యాసపు దిద్దుబాట్లు చేసినవారిలో రెండోస్థానంలో నిలిచారు.

Monday 20 January 2014

తెవికీలో పెరుగుతున్న దిద్దుబాట్ల సంఖ్య

గత 4 మాసాల తెలుగు వికీపీడియా వ్యాసపు దిద్దుబాట్ల ప్రగతిని పరిశీలిస్తే క్రమక్రమంగా దిద్దుబాట్లు పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. సెప్టెంబరు 2006 మాసములో జరిగిన్ ఆల్‌టైం తెవికీ రికార్డు ఇప్పటి సంఖ్యలు దూరంలోనే ఉన్ననూ చాలాకాలం పాటు 5-10 వేలమధ్యలో ఊగిసలాడుతున్న దిద్దుబాట్ల సంఖ్య (మార్చి2013లో మినహా) సెప్టెంబరు నుంచి 12-13 వేలకు చేరింది. ఈ దిద్దుబాట్ల సంఖ్యలో అధికంగా చిన్న దిద్దుబాట్లే ఉన్ననూ, అవి వ్యాస సమాచారానికి పెద్దగా ఉపకరించకపోయిననూ గణాంకాల పరంగా మాత్రం దిద్దుబాట్లు పెరిగినట్లే చెప్పుకోవచ్చు.


దిద్దుబాట్లు ఎవరు చేశారు?
సెప్టెంబరు నుంచి 12వేలకు పైగా దిద్దుబాట్లు జరుగుతున్ననూ అందులో ఒకే సభ్యుని దిద్దుబాట్లు 2500+ ఉన్నాయి. మరో ఇద్దరి (సెప్టెంబరులో ముగ్గురి) దిద్దుబాట్లు 1000+ ఉన్నాయి. అంటే దాదాపు సగభాగం వ్యాసపు దిద్దుబాట్లు ముగ్గురు సభ్యులతోనే జరుగుతుందన్నమాట. మాసాల వారీగా విశ్లేషించిన గత పోస్టులలో కూడా ఇద్దరు ముగ్గురు సభ్యులదే సగభాగంపైగా దిద్దుబాట్లు ఉన్నట్లుగా చూపబడినది.

దిద్దుబాట్లు దేనిపై జరుగుతున్నాయి?
అత్యధిక దిద్దుబాట్లు చేసిన సభ్యులు వ్యాసంలో చిన్నచిన్న మార్పులే చేశారు. ఒక సభ్యుడు పిన్‌కోడ్ లను గ్రామవ్యాసాలలో పెట్టగా, మరో సభ్యుడు గ్రామ వ్యాసాలలో జనాభా వివరాలు పెట్టారు. జనవరిలో కూడా బాటుచేసే మార్పులే సభ్యులు చేస్తూ గ్రామవ్యాసాలలొ ఇన్ఫోబాక్సు పెడుతున్నారు. సభ్యులు ఇలాంటి దిద్దుబాట్లు కాకుండా వ్యాసంలో నాణ్యమైన సమాచారాన్ని చేర్చడానికి కృషిచేయడానికి ప్రయత్నించడం మంచిది. 

Sunday 12 January 2014

తెలుగు వికీపీడియాలో "తెలంగాణ ప్రాజెక్టు" ప్రారంభం

జనవరి 11, 2014 నాడు తెలుగు వికీపీడియాలో "తెలంగాణ ప్రాజెక్టు" ప్రారంభించబడింది. కొద్దిరోజుల క్రితమే తెలంగాణ పోర్టల్ ప్రారంభం కాగా ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రాజెక్టు ప్రారంభమైనదని తెలియజేయుటకు సంతోషిస్తున్నాను. తెలంగాణకు చెందిన 10 జిల్లాలలోని గ్రామాలు, మండలాలు, జిల్లా వ్యాసాలు, ప్రముఖులు, పర్యాటక ప్రాంతాలు, నియోజకవర్గాలు, చారిత్రక కట్టడాలు, సంస్థానాలు, రైల్వేస్టేషన్లు తదితర వ్యాసాల పరిస్థితి మరియు కొత్తగా చేరిన వ్యాసాలు, కృషిచేస్తున్న సభ్యులు తదితర సమాచారం ఈ ప్రాజెక్టు ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే కాకుండా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వ్యాసాల అభివృద్ధికి, ఈ ప్రాజెక్టులో కృషిచేస్తున్న సభ్యులకు తగిన గుర్తింపు ఇవ్వడానికి ఇది దోహడపడుతుంది. ఈ ప్రాజెక్టు విషయంలో మరిన్ని సలహాలు, సూచనలకు సదా ఆహ్వానం. ఈ ప్రాజెక్టులో ఎవరైననూ ఏ అంశంపైన అయిననూ తమకు తెలిసిన విషయాలను చేర్చవచ్చు, తాము తీసిన బొమ్మలను అప్లోడ్ చేయవచ్చు, ఉన్న వ్యాసాలలో మార్పుచేర్పులు చేసి నాణ్యత పెంచవచ్చు, తాజాకరణ చేయవచ్చు. ఈ ప్రాజెక్టులో కృషిచేసే వారి గురించి ఎప్పటికప్పుడు సమాచారం పోందవచ్చు.

Wednesday 8 January 2014

తెవికీ నవంబరు 2013 మాసపు గణాంకాలు

తెలుగు వికీపీడియాలో నవంబరు 2013లో కొత్తగా 5గురు సభ్యులు (5+ దిద్దుబాట్లు చేసినవారు) చేరారు. దీనితో మొత్తం సభ్యుల సంఖ్య 613కు చేరింది. ఈ మాసంలో 5+ దిదుబాట్లుచేసిన సభ్యుల సంఖ్య 37 కాగా, 100+ దిద్దుబాట్లు చేసిన వారు 13. 100 కంటె అధికంగా దిద్దుబాట్లు చేసినవారు ఒక మాసంలో రెండంకెలు ఉండటం ఇది వరసగా నాలుగవ సారి. ఇది తెవికీ చరిత్రలోనే రికార్డు. ఈ మాసంలో రోజుకు సరాసరిన 13 కొత్త వ్యాసాలు సృష్టించబడ్డాయి. 11/2013లో దాదాపు 13వేల దిద్దుబాట్లు జరిగాయి.



సభ్యుల వారీగా దిద్దుబాట్ల సంఖ్య చూస్తే ఈ మాసం కూడా సభ్యుడు YVSREDDY 3,437 దిద్దుబాట్లతో తొలిస్థానంలో నిలిచారు. సభ్యుడు శ్రీరామమూర్తి 2,264 దిద్దుబాట్లతో రెండోస్థానంలో ఉన్నారు. వీరిద్దరూ తెవికీ దిద్దుబాట్ల ర్యాంకింగులో ఒక్కో ర్యాంకు పైకెక్కి 5, 10వ స్థానాలకు చేరారు. నేను (C.Chandra Kanth Rao) 1,046 దిద్దుబాట్లతో 3వ స్థానంలో, T.sujatha (786), Palagiri (720), Rajasekhar1961 (643) తర్వాతి స్థానాలలో నిలిచారు.

Thursday 2 January 2014

2013లో తెవికీకి ఎందరు చూశారు?

2013 సంవత్సరంలో తెవికీకి మొత్తంపై 28.3 మిలియన్ల హిట్లు నమోదైనాయి. తమిళ వికీతో పోలిస్తే ఇది 42% మాత్రమే. 28.8 మిలియన్లు హిట్లు జరిగిన 2012 సం.తో పోల్చిననూ ఇది కొంత తక్కువే. జూలై మాసంలో గరిష్టంగా 2.9 మిలియన్ల హిట్లు జరిగాయి. తమిళ వికీలో ఒక మాసంలో జరిగిన కనిష్ట హిట్లు (4.2) కంటే ఇది తక్కువగా ఉంది. తెవికీ చరిత్రలోనే గరిష్ట హిట్లు (4.5) నమోదైన మాసం ఫిబ్రవరి 2010 కంటే తమిళ వికీలో ప్రతిమాసపు ఎక్కువే ఉంది. 2013లో హిందీ వికీ సరాసరి వీక్షణలు 9.2మి.గా ఉంది. మలయాళం వికీ సరాసరి కూడా మనకంటే అధికంగానే (3.9) ఉంది. మన వీక్షణలు పెరగాలంటే వ్యాసాలలో నాణ్యత పెరగడమే కాకుండా పాఠకులు ఎలాంటి వ్యాసాలకై సందర్శిస్తున్నారో పరిశీలించి అలాంటి వ్యాసాలపై కృషిచేయవలసి ఉంటుంది.